Friday, 23 February 2018

Sirivennela songs - Ghal Ghal lyrics

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడిగానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలువదు ప్రాణం
ఆపరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటంటే
ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకూ చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

మండే పోలిమినడగందే
తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే
పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమలై
దరి చేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకు తనంత తానై
అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగులతో అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో ఎర్ర పడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా 

No comments:

Post a Comment